ఎక్కువగా చూచినవి
కొత్తవి
- జంధ్యాలగారి జ్ఞాపకాలు (శ్రీమతి విజయదుర్గ)
- జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం
- మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)
- అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి
- పడమటి సంధ్యారాగం సినిమా - ముద్దుగారే యశోద
- క్లాస్ మేట్ - గ్లాస్ మేట్
- "విచిత్రం" సినిమా
- "శ్రీవారికి ప్రేమలేఖ" సినిమా
- "బాబాయ్ అబ్బాయ్" సినిమా
- "విచిత్ర ప్రేమ" సినిమా
RSS Feeds

online visitors
We have 52 guests and no members online
Site Info
- Articles View Hits
- 778572
"చంటబ్బాయ్" సినిమాలోంచి
- Details
- Category: టిట్ బిట్స్
- Published Date
- Written by శ్రీనివాస్ పప్పు
- Hits: 4905
చంటబ్బాయ్ సినిమాలో తను అమ్మాయిగా నటించడాన్ని తల్చుకుని చిరంజీవి మాటల్లోనే:
నిజం చెప్పొద్దూ నన్ను నేను అమ్మాయిగా ఊహించుకోగానే నవ్వొచ్చేసింది.మళ్ళీ జంధ్యాల ధైర్యం చెప్పారు.ఆ ధైర్యం తోటే మీసాలు తీసేసి రంగం లోకి దిగాను. అమ్మాయిగా నటించడం చాలా సరదాగా థ్రిల్లింగ్ గా అనిపించింది. సాధారణంగా కాస్త ఓవర్ గా నటిస్తారు కానీ అలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడ్డాను. నా పెర్సనాలిటీని అందుకు తగినవిధంగా మలుచుకున్నాను. సున్నితమయిన మూమెంట్స్ ఇస్తూ కళ్ళల్లో చిలిపితనం, నడకలో హొయలూ తెచ్చుకుని ఎక్కడా అతిలేకుండా జాగ్రత్తగా నటించాను.ఈ గెటప్ లో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ చేసారు. ఆడవేషంలో ఉన్న నాతో ఫొటో దిగాలని యూనిట్ లో ఉన్నవాళ్ళందరూ ఉత్సాహపడ్డారు. కొందరు నిర్మాతలు పెద్ద హీరోయిన్ల మీదే చెయ్యేసి ఫొటో తీయించుకున్నట్టే ఫీలయ్యారు. తర్వాత నేను ఆ గెటప్ తీసేసాక నిరుత్సాహపడిపోయారు.
హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు)5వ భాగం
- Details
- Category: వ్యాసాలు
- Published Date
- Written by బులుసు సుబ్రహ్మణ్యం
- Hits: 4550
సినిమాలకి ముఖ్యమైన సంగీతం, పాటలు గురించి జంధ్యాల చాలా శ్రద్ధ తీసుకుంటారు.
కౌమార దశలో ఉన్న ప్రేమికుడు, ప్రేమికురాలు ఇంటిలోంచి పారిపోయి వచ్చేస్తారు. ఒక హోటల్ గదిలో ఇద్దరే మొదటిమాటు ఉంటారు. ఈ సందర్భంలో ఇద్దరి లోనూ ఆమాయకత్వం , తెలుసుకోవాలనే కోరిక ఉంటాయి. ఇద్దరిలోనూ స్వచ్ఛత, నిర్మలత్వం ఉంది కానీ వాంఛ కూడా ఉంది.
జంధ్యాల కల "అన్నమయ్య" సినిమా గురించి విశేషాలు.
- Details
- Category: వ్యాసాలు
- Published Date
- Written by శ్రీ అట్లూరి
- Hits: 5874
మీ అందరికీ ఆనందభైరవి సినిమా గురించి తెలిసే ఉంటుంది ... ఆ సినిమా పూర్తి అయ్యాక...దాన్ని కొనే వాళ్ళు దొరకలేదు...సినిమా పూర్తి అయ్యాక దాదాపు గా ఒక సంవత్సరం ఆ సినిమా ని కొనే నాధుడు లేకుండా పోయాడు. కామెడీ సినిమాలు తీసే జంధ్యాల ఇలాంటి సినిమా తీస్తే ఎవరూ చూడరు అన్న గుడ్డి నమ్మకం వల్ల దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. చివరకి దానికి నంది అవార్డు వచ్చాక లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు సినిమా మొత్తం హక్కులు ఇచ్చే పద్దతి మీద కొంటాము అన్నారు. (శంకరాభరణం సినిమాకి కూడా ఇదే జరిగింది). "ఆనంద భైరవి" సినిమా కి నిర్మాతలు బి.ఎ.వి.శాండిల్య పాత్రికేయుడు,సీత పద్మరాజు గారు కూడా మరీ ఎక్కువ ఉన్నవాళ్లు కాదు. దాంతో వాళ్ళకి ఏదో ఒక ధరకి అమ్మక తప్పలేదు. సినిమా విడుదల అయ్యాక జరిగిన విషయాలు మీకు తెలిసినవే...
హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు) 4 వ భాగం
- Details
- Category: వ్యాసాలు
- Published Date
- Written by బులుసు సుబ్రహ్మణ్యం
- Hits: 4664
సర్వ సాధారణంగా రచయిత, సినిమాలో ఒక సన్నివేశం దర్శకుడి అభిరుచులు, దర్శకుడు కధను చిత్రీకరించే విధానం లను దృష్టిలో పెట్టుకొని వ్రాయాల్సి ఉంటుంది. దర్శకుడి ఆదేశాను సారం వ్రాయడం వల్ల రచయిత తన భావాలను, సృజన ను పూర్తిగా పలికించలేకపోవచ్చు. రచయితే దర్శకుడిగా కూడా ద్విపాత్రాభినయనం చేయాల్సి వచ్చినప్పుడు, రెండు పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించే టప్పుడు స్వల్ప ఘర్షణ బహుశా తప్పక పోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వైవిద్యభరితమైన , ఇదివరలో ఎవరూ సాహసించని కొత్త వరవడి ని కధా క్రమం లో కానీ, చిత్రీకరణలో కానీ, చిత్రం జయాపజయాల తో నిమిత్తం లేకుండా ఎంచుకోగలడా? జంధ్యాల ఇవి అన్నీ చేసి చూపించారు. అటు మాస్ కమర్షియల్ సినిమాలు ఇటు కళాత్మకమైన సినిమాలకు కూడా, విజయ వంతంగా వరుసగా ఒక దాని తరువాత ఒకటి శతదినోత్సవ చిత్రాలకు రచిస్తూ కూడా తనలోని సృజనాత్మకతను వెలికి తీసి ఒక కొత్త తరహా సినిమాలకి నుడికారం చుట్టారు జంధ్యాల. మధ్యే మార్గంలో కళాత్మక సినిమాల్లోని ఆలోచనా ధోరణులని సున్నితత్వాన్ని మాస్ సినిమాల్లోని జనాకర్షణ పద్ధతులని మేళవించి ప్రేక్షకులను మెప్పించారు.
జంధ్యాల సృష్టి… లాఫింగ్ లక్ష్మి… శ్రీలక్ష్మి
- Details
- Category: వ్యాసాలు
- Published Date
- Written by శ్రీనివాస్ పప్పు
- Hits: 9563
హాస్యం చేయాలంటే ముఖాన్ని వికారంగా మార్చాలి. ఆడవాళ్లు ఆ పని చేయడానికి ఇష్టపడరు. అందుకే మనకు లేడీ కమెడియన్స్ తక్కువ’ అన్నాడు కమెడియన్ జావెద్ జాఫ్రీ. కాని- బహుశా- అలా ఆలోచించడానికి శ్రీలక్ష్మికి వీలు లేదు. అంత తీరుబడీ లేదు.కుటుంబ అవసరాలు శూలం పట్టుకొని తరుముతూ వుంటే పరిగెత్తుకొని వెళ్లి సినీ సముద్రంలో దూకింది. మునకలు వేసింది. గుటకలు మింగింది. ఆపైన కామెడీ అనే బల్లచెక్క దొరికితే ఎక్కి కూచుంది.ఇక అక్కణ్ణుంచి ఆమె చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది.తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పువ్వులుగా పెనవేసుకున్నది.
శుభం జరగాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉండాలంటారు. అలాగే లాఫింగ్ శ్రీలక్ష్మి సినిమాలు కూడా.
ఎప్పుడైనా డస్సిపోయినప్పుడు బెంగటిల్లినప్పుడు నల్లమబ్బులు కమ్ముకున్నప్పుడు వీటన్నింటిని ఫెటీల్మని విరిచే ఒక్క నవ్వే రీఛార్జ్.
ఆ నవ్వుని శ్రీలక్ష్మి వడ్డిస్తే - బెస్ట్ రీఛార్జ్.
More Articles...
- తెలుగు పాటలకు పట్టు పరికిణీలు
- హాస్య బ్రహ్మ జంధ్యాల....(వెలుగు నీడలు)3వ భాగం
- ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో ముఖాముఖీ
- హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు) 2వ భాగం
- హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు) 1వ భాగం
- ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!
- చినుకులా రాలి..నదులుగా సాగి
- పడమటి సంధ్యారాగం
- ఆనందభైరవి
- హాస్య బ్రహ్మగారి " చంటబ్బాయ్ "