జంధ్యావందనం http://jandhyavandanam.com/component/content/?view=featured Thu, 26 Apr 2018 05:36:44 +0000 Joomla! - Open Source Content Management en-gb జంధ్యాలగారి జ్ఞాపకాలు (శ్రీమతి విజయదుర్గ) http://jandhyavandanam.com/2011-10-04-08-49-10/146-2017-01-16-08-00-18 http://jandhyavandanam.com/2011-10-04-08-49-10/146-2017-01-16-08-00-18

జనవరి 14న జంధ్యాల గారి పుట్టినరోజు సందర్భంగా వారి అశేష అభిమానులందరికోసం దూరదర్శన్ (తెలుగు) ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి విజయదుర్గ గారు జంధ్యాల గారితో గతంలో చేసిన ఇంటర్వ్యూ లో కొన్ని విశేషాలు ఈ కింద లింక్ లో

]]>
Featured ఇంటర్వ్యూలు Mon, 16 Jan 2017 08:00:18 +0000
జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం http://jandhyavandanam.com/component/content/article/14-2011-10-04-08-43-49/145-2014-11-05-06-29-06 http://jandhyavandanam.com/component/content/article/14-2011-10-04-08-43-49/145-2014-11-05-06-29-06

123 తెలుగు.కాం వారి సౌజన్యంతో

కింద లింక్ లో అసలు వార్త చూడవచ్చు

http://www.123telugu.com/telugu/news/late-director-jandhyala-receives-doctorate.html

]]>
Featured వార్తల్లో జంధ్యాల Wed, 05 Nov 2014 06:29:06 +0000
అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/143-2014-03-20-07-30-16 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/143-2014-03-20-07-30-16

ఆదివిష్ణు రాసిన 'సత్యం గారి ఇల్లు ' కధ/నవల లోని సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు.ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నిజంగా జీవించారనే చెప్పాలి.

లక్ష్మీపతి పాత్రను తొలుత రావుగోపాలరావు చేత వేయించాలనుకున్నారు.లుక్ పరంగానూ,నేటివిటీ పరంగానూ ఆయన కరక్ట్ కాదేమోనని ఎవరో సందేహం వెలిబుచ్చటంతో జంధ్యాల కోటను ఎన్నుకున్నారు.అప్పటికి కోట సినిమా ఫీల్డ్ కొచ్చి  రెండేళ్ళు అవుతోంది.


సినిమాల్లోకొచ్చేముందు కోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు.జంధ్యాల "అమరజీవి" సినిమా చేస్తున్నప్పుడు సరదాగా కోట తో ఓ వేషం వేయించారు. అక్కినేని ఇంటి ఓనర్ పాత్రలో కనిపిస్తారాయన.కోటకి నటునిగా తొలి చిత్రం "ప్రాణం ఖరీదు".ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో అమరజీవి లో నటించారు.తర్వాత బాబాయ్ అబ్బాయ్ లో కూడా ఓ పాత్ర పోషించారు.

]]>
Featured టిట్ బిట్స్ Thu, 20 Mar 2014 07:30:16 +0000
పడమటి సంధ్యారాగం సినిమా - ముద్దుగారే యశోద http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/142-2014-03-15-08-45-35 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/142-2014-03-15-08-45-35

పడమటి సంధ్యారాగం సినిమాలో "ముద్దుగారే యశోద" అన్న పాట వెనక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. అమెరికాలో ఈ చిత్రం బాగోగులు చూసుకునే వారికి ఓ బాబు ఉన్నాడు.ఆ బాబు జంధ్యాల దృష్టిని ఆకర్షించాడు.ఆ అబ్బాయిని చిన్ని కృష్ణుడిలా అలంకరించి ఓ పాట చిత్రీకరించాలనుకున్నారు.కానీ ఆ అబ్బాయి అస్సలు సహకరించలేదు.ఫ్లూట్ ఇస్తే విరిచేసేవాడు,అలా చాలా ఫ్లూట్లు విరక్కొట్టేసాడు,నవ్వుతూ మొహం పెట్టు అంటే కెమేరా ఆన్ అయ్యేసరికి వెక్కిరించేవాడు,కెమేరా చిత్రీకరించగలిగే ఫీల్డ్ లోంచి పారిపోయేవాడు,నడుస్తూ రా అంటే దొర్లేవాడు,అలా కొన్ని వందల అడుగుల ఫిల్మ్ ఎక్స్‌పోజ్ అయిపోయింది.జంధ్యాల ఊరుకోలేదు,వాటన్నిటినీ చాలా తెలివిగా ఎడిట్ చేసి 'ముద్దుగారే యశోదా అన్న అన్నమయ్య కీర్తనని జతచేసారు.ఇవాళ ఆ పాటని చూస్తుంటే బాలకృష్ణుడి అల్లరిలా ఉంటుందే తప్ప మరోలా ప్రేక్షకుడికి తట్టే అవకాశం లేదు,అదీ జంధ్యాల సృజనాత్మకత.ప్రేమానుభూతిలో సంధ్య మునిగితేలుతున్న సమయంలోనే ఈ పాట పెట్టడం ఓ గొప్ప ఆలోచన.]]> Featured టిట్ బిట్స్ Sat, 15 Mar 2014 08:45:35 +0000 "ఆనందభైరవి" సినిమా (తెలుగు) http://jandhyavandanam.com/2011-10-04-08-48-14/127-2014-01-01-09-11-06 http://jandhyavandanam.com/2011-10-04-08-48-14/127-2014-01-01-09-11-06 ]]> Featured సినిమాలు Wed, 01 Jan 2014 09:11:06 +0000 జంధ్యాలకు వేటూరి "అక్షర సంధ్యావందనం" http://jandhyavandanam.com/2011-09-28-17-02-35/125-2012-10-17-14-09-46 http://jandhyavandanam.com/2011-09-28-17-02-35/125-2012-10-17-14-09-46

జంధ్యా వందనం

హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళూ కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.

తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.

]]>
Featured వ్యాసాలు Wed, 17 Oct 2012 14:09:46 +0000
సప్తపది సినిమా సంభాషణలు http://jandhyavandanam.com/2011-10-04-08-47-19/124-2012-10-16-09-10-26 http://jandhyavandanam.com/2011-10-04-08-47-19/124-2012-10-16-09-10-26

 

ఆచారావ్యవహారాలన్నవి మనస్సుల్ని క్రమమయిన మార్గం లో పెట్టడానికే గానీ కులమనే పేరుతో మనుషుల్ని విడదీయడానికి కాదు అన్న శంకరాభరణం శంకరశాస్త్రి మాటలే ఈ చిత్ర నిర్మాణానికి ప్రేరణ.

 

 

 

 

 

]]>
Featured మెచ్చుతునకలు Tue, 16 Oct 2012 09:10:26 +0000
జంధ్యాల గురించి వీళ్ళేమంటున్నారంటే http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/123-2012-06-19-08-40-04 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/123-2012-06-19-08-40-04

 

ఈ రోజు జంధ్యాల వర్ధంతి. ఆ సందర్భంగా ఆయనతో పరిచయమున్న ప్రముఖులు ఏమంటున్నారో చూడండి

]]>
Featured టిట్ బిట్స్ Tue, 19 Jun 2012 08:40:04 +0000
సుత్తివేలు మాటల్లో జంధ్యాల http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/119-2012-04-23-08-16-24 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/119-2012-04-23-08-16-24

జంధ్యాలతో ప్రయాణం:

'ముద్దమందారం ' సినిమా టైంకి నేను వైజాగ్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్నచిన్న నాటికలు వేసేవాణ్ణి! అదే సినిమాలో భాగంగా ఒక నాటిక ప్రదర్శన నిమిత్తం వచ్చిన నేను, ఆయన దృష్టిలో  పడడంతో, దానిలో నాకు ఒక చిన్న రిసెప్షనిస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. అలా ఆయనతో మొదలైన ప్రస్థానం, నాకు తెలిసి, ఒక్క సినిమా తప్ప దాదాపు అన్ని సినిమాల్లోనూ సాగింది. బిజీగా ఉండి, అమెరికా వెళ్ళలేక పోవడంతో ముందు రెండు సినిమాలు చేయడం మిస్సయ్యాను. ఒకటి - చిన్నికృష్ణుడు, రెండోది - పడమటి సంధ్యారాగం,  కాని ఆ రెండో సినిమాలో కూడా, రెండు మూడు ఆడిటోరియం సీన్స్ ఇక్కడ మద్రాస్‌లో తీసి, అవి సినిమాలో అతికించారు.

]]>
Featured టిట్ బిట్స్ Mon, 23 Apr 2012 08:16:24 +0000
శ్రీలక్ష్మి మాటల్లో జంధ్యాల http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/118-2012-04-17-08-14-49 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/118-2012-04-17-08-14-49

మా నాన్నగారు (హీరో అమర్‌నాథ్) మా చిన్నతనంలోనే చనిపోవడంతో, ఫ్యామిలీ  కొన్ని కష్టాలు ఎదుర్కొంది.  దాంతో నేను సినిమాల్లోకి రావాల్సివచ్చింది. తమిళ్, మళయాళంలో అయిదారు సినిమాల్లో హీరోయిన్‌గా చేశాక, పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, 'నివురుగప్పిన నిప్పు' లో మొదటిసారి కమెడియన్ గా చేశాను. తర్వాత జంధ్యాలగారి 'రెండు జళ్ళ సీత ' లో చిన్న అవకాశమైనా వచ్చినదాన్ని వదులుకోవడం ఇష్టంలేక ఒప్పుకున్నాను! కాని, అదృష్టం అనండి, టర్నింగ్ పాయింట్ అనండి... ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ నా టాలెంట్‌ని గుర్తించి, నా క్యారెక్టర్ని టకటకమని  పొడిగించుకుంటూ పోయారు! ఇక ఆ తరువాత చాలా సినిమాలు చేశాను. 'శ్రీలక్ష్మి బ్రాండ్ ' అనేది ఒకటి క్రియేట్ అయింది.     

]]>
Featured టిట్ బిట్స్ Tue, 17 Apr 2012 08:08:02 +0000
నరేష్ మాటల్లో జంధ్యాల http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/117-2012-04-09-05-02-48 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/117-2012-04-09-05-02-48

జంధ్యాలతో పరిచయం

నాకు చిన్నప్పటినుండీ ఒకటే తెలుసు.. యాక్టరవ్వాలని! మా అమ్మకు మాత్రం నేను డాక్టరవ్వాలని! పెద్దయ్యాక ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఒక బంగళా కూడా ముందే కొనిపెట్టింది! కాని, నేను.. ' ఇక వీడు జన్మలో పాసవ్వడు ' అని వాళ్ళనుకునేందుకు వీలుగా కష్టపడి మూడుసార్లు ఫెయిల్ అయ్యాను. పదహారేళ్ళొచ్చాక ఓసారి మేడమీంచి దూకడానికి ప్రయత్నించాను. అమ్మ 'ఒరేయ్! వద్దురా!' అంటుందేమోరా అనుకున్నాను. కాని ఆవిడ - 'కిందకైనా దిగు, లేకపోతే దూకు, పీడ వదిలొపోతుంది... హాస్పిటల్‌కు  నీ మెమోరియల్ బోర్డు పెట్టుకుంటాను ' అంది.

]]>
Featured టిట్ బిట్స్ Mon, 09 Apr 2012 05:02:48 +0000
సరదాగా కొన్ని... http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/115-2012-03-30-12-58-55 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/115-2012-03-30-12-58-55

పర్సనల్ ట్రివియా  

 

 • విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో జంధ్యాల, అశ్వనీదత్, సుత్తి వీరభద్రరావు తదితరులు క్లాస్మేట్స్ ట!
 • జంధ్యాలను ఒక గంట కలిసిన మనిషికి కొన్నేళ్ళుగా స్నేహం ఉందేమో అనిపించే ఫీలింగ్ కలిగేదిట!
 • ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ. హైదరాబాద్, విజయవాడ,  చెన్నై, వైజాగ్.. ... ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేదట!    
 • ప్రాక్టికల్ జోక్స్ వేయడం ఈయనకు చాల ఇష్టమట! అలాగని ఏది ఎవరినీ నొప్పించేలా ఉండేది కాదట!
 • జంధ్యాలకి మ్యాజిక్ లో కూడా కొంత ప్రవేశం ఉందట! మరి అది పట్టాభిరాం స్నేహంతో అలవడిందేమో!
 • తనకున్న దురవాట్ల గురించి కూడా జోకులేసేవారట! రైటరన్నాక ఏదో ఒక అలవాటు లేకపోతే బాగుండదు అనేవారట!]]> Featured టిట్ బిట్స్ Fri, 30 Mar 2012 12:58:55 +0000 జంధ్యాల స్మారక సభ చిత్రాలు http://jandhyavandanam.com/2011-09-28-18-34-07/114-2012-03-28-09-48-59 http://jandhyavandanam.com/2011-09-28-18-34-07/114-2012-03-28-09-48-59 ]]> Featured ఫోటోలు Wed, 28 Mar 2012 09:48:59 +0000 జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/113-2012-03-22-04-15-47 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/113-2012-03-22-04-15-47

  జంధ్యాలతో అనుబంధం......

  జంధ్యాల గారు రాసిన ' ఓ చీకటిరాత్రి ' నాటికనే నేనోసారి ప్రదర్శిస్తుంటే , ఆయనే చీఫ్ గెస్ట్ గా వచ్చారు . దాన్లో నా పెర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చి హీరోగా అవకాశమిస్తానన్నారు . దెన్, వన్ ఫైన్ డే చెన్నై రమ్మని పిలిచారు. నేనూ మావయ్యా వెళ్ళాం. నమ్మరు- వెళ్ళిన గంటలోపల నా షేపులన్నీ మార్చి, నన్ను ట్రిం  గా స్టైలిష్ గా తయారుచేసారు. హార్స్ రైడింగ్ , స్విమ్మింగ్ అన్నీ నేర్పించారు . ఓ వారం రోజులపాటు ' మరోచరిత్ర ' చూపించి, నటనలో మెళకువలు తెలుసుకోమనేవారు. అలా నాకు ' ముద్దమందారం ' లో మొదటి అవకాశాన్నిచ్చారు. రెండో సినిమా బ్రేక్ పడకూడదని , ' మల్లెపందిరి ' లో గెస్ట్ రోల్ చేయించారు. మూడోది  ' నాలుగు స్థంభాలాట ' ! అదే నేను చేసిన ఆఖరు సినిమా . నేను మొదటినుంచీ చదువులో టాపర్ని అవటంతో , నాకు ఎప్పటికయినా సిఏ చేయాలని ! అదే విషయం చెప్పగానే , నేనయితే సినిమా చేయమనే అంటాను , కానీ ...నీకు చదువుమీదే ఎక్కువ ఇంట్రస్ట్ కాబట్టి, రెండు పడవలమీద కాళ్ళు పెట్టకుండా అదే చెయ్యి అన్నారు. దాంతో విజయవాడ తిరిగొచ్చి చదువు పూర్తిచేశాను. తరవాత మళ్ళీ సినిమా వైపు వెళ్ళలేదు. టివి రంగంలోకి వెళ్ళాను. అక్కడ కావలిసినంత పేరు తెచ్చుకున్నాను ! గొప్ప విషయం ఏమిటంటే, తర్వాత్తరవాత నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్ కి (సంధ్యారాగంలో శంఖారావం ) జంధ్యాల గారు డైరెక్ట్ చేశారు.  అది నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవం.    

  ]]>
  Featured టిట్ బిట్స్ Thu, 22 Mar 2012 04:15:47 +0000
  దర్శకులు కె. రాఘవేంద్ర రావు గారి జ్ఞాపకాలలో జంధ్యాల http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/112-2012-03-15-10-58-55 http://jandhyavandanam.com/2011-11-16-08-39-45/112-2012-03-15-10-58-55

  జంధ్యాలతో ప్రయాణం ......

  మొదట్లో  నా సినిమాలన్నిటికీ ఎక్కువశాతం సత్యానంద్ రాసేవాడు . ' అడవిరాముడు ' సత్యచిత్ర వాళ్ళు తీస్తానని ముందుకురావటం , వాళ్ళతో జంధ్యాల అంతకుముందరే ' జీవనజ్యోతి ' వంటి  సినిమాలకు  పనిచేయడంతో , ఆ అనుబంధంతో వాళ్ళు అడవిరాముడు కి కూడా అతన్నే తీసుకుంటామన్నారు . అదీకాక ,  అంతకుముందరే  సత్యానంద్ కీ జంధ్యాలకీ మంచి పరిచయం ఉండటంతో( జంట రచయితలుగా కొన్ని సినిమాలకు కూడా పని చేసారు ) అందరం కలిసి చాలా సరదాగా కథ డిస్కషన్ లో కూర్చున్నాం . ఇక ఒకసారి అడవిరాముడు హిట్ అయేసరికి , దాని తరువాత న్యాచురల్ చాయిస్ అతడే అయ్యి, ' వేటగాడు ' నుంచి ' జగదేకవీరుడు అతిలోకసుందరి ' దాకా దాదాపు 15 సినిమాల దాకా చేసాడు. నాతో చేసినవి తక్కువ సినిమాలే  అయినా  చేసినవన్నీ  పెద్ద పిక్చర్లే , అన్నీ దాదాపు సెన్సేషనల్ హిట్సే .

  ]]>
  Featured టిట్ బిట్స్ Thu, 15 Mar 2012 10:58:55 +0000