నరేష్ మాటల్లో జంధ్యాల

జంధ్యాలతో పరిచయం

నాకు చిన్నప్పటినుండీ ఒకటే తెలుసు.. యాక్టరవ్వాలని! మా అమ్మకు మాత్రం నేను డాక్టరవ్వాలని! పెద్దయ్యాక ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఒక బంగళా కూడా ముందే కొనిపెట్టింది! కాని, నేను.. ' ఇక వీడు జన్మలో పాసవ్వడు ' అని వాళ్ళనుకునేందుకు వీలుగా కష్టపడి మూడుసార్లు ఫెయిల్ అయ్యాను. పదహారేళ్ళొచ్చాక ఓసారి మేడమీంచి దూకడానికి ప్రయత్నించాను. అమ్మ 'ఒరేయ్! వద్దురా!' అంటుందేమోరా అనుకున్నాను. కాని ఆవిడ - 'కిందకైనా దిగు, లేకపోతే దూకు, పీడ వదిలొపోతుంది... హాస్పిటల్‌కు  నీ మెమోరియల్ బోర్డు పెట్టుకుంటాను ' అంది.

Read more...

సరదాగా కొన్ని...

పర్సనల్ ట్రివియా  

 

  • విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో జంధ్యాల, అశ్వనీదత్, సుత్తి వీరభద్రరావు తదితరులు క్లాస్మేట్స్ ట!
  • జంధ్యాలను ఒక గంట కలిసిన మనిషికి కొన్నేళ్ళుగా స్నేహం ఉందేమో అనిపించే ఫీలింగ్ కలిగేదిట!
  • ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ. హైదరాబాద్, విజయవాడ,  చెన్నై, వైజాగ్.. ... ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేదట!    
  • ప్రాక్టికల్ జోక్స్ వేయడం ఈయనకు చాల ఇష్టమట! అలాగని ఏది ఎవరినీ నొప్పించేలా ఉండేది కాదట!
  • జంధ్యాలకి మ్యాజిక్ లో కూడా కొంత ప్రవేశం ఉందట! మరి అది పట్టాభిరాం స్నేహంతో అలవడిందేమో!
  • తనకున్న దురవాట్ల గురించి కూడా జోకులేసేవారట! రైటరన్నాక ఏదో ఒక అలవాటు లేకపోతే బాగుండదు అనేవారట!

    Read more...

జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల

జంధ్యాలతో అనుబంధం......

జంధ్యాల గారు రాసిన ' ఓ చీకటిరాత్రి ' నాటికనే నేనోసారి ప్రదర్శిస్తుంటే , ఆయనే చీఫ్ గెస్ట్ గా వచ్చారు . దాన్లో నా పెర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చి హీరోగా అవకాశమిస్తానన్నారు . దెన్, వన్ ఫైన్ డే చెన్నై రమ్మని పిలిచారు. నేనూ మావయ్యా వెళ్ళాం. నమ్మరు- వెళ్ళిన గంటలోపల నా షేపులన్నీ మార్చి, నన్ను ట్రిం  గా స్టైలిష్ గా తయారుచేసారు. హార్స్ రైడింగ్ , స్విమ్మింగ్ అన్నీ నేర్పించారు . ఓ వారం రోజులపాటు ' మరోచరిత్ర ' చూపించి, నటనలో మెళకువలు తెలుసుకోమనేవారు. అలా నాకు ' ముద్దమందారం ' లో మొదటి అవకాశాన్నిచ్చారు. రెండో సినిమా బ్రేక్ పడకూడదని , ' మల్లెపందిరి ' లో గెస్ట్ రోల్ చేయించారు. మూడోది  ' నాలుగు స్థంభాలాట ' ! అదే నేను చేసిన ఆఖరు సినిమా . నేను మొదటినుంచీ చదువులో టాపర్ని అవటంతో , నాకు ఎప్పటికయినా సిఏ చేయాలని ! అదే విషయం చెప్పగానే , నేనయితే సినిమా చేయమనే అంటాను , కానీ ...నీకు చదువుమీదే ఎక్కువ ఇంట్రస్ట్ కాబట్టి, రెండు పడవలమీద కాళ్ళు పెట్టకుండా అదే చెయ్యి అన్నారు. దాంతో విజయవాడ తిరిగొచ్చి చదువు పూర్తిచేశాను. తరవాత మళ్ళీ సినిమా వైపు వెళ్ళలేదు. టివి రంగంలోకి వెళ్ళాను. అక్కడ కావలిసినంత పేరు తెచ్చుకున్నాను ! గొప్ప విషయం ఏమిటంటే, తర్వాత్తరవాత నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్ కి (సంధ్యారాగంలో శంఖారావం ) జంధ్యాల గారు డైరెక్ట్ చేశారు.  అది నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవం.    

Read more...

దర్శకులు కె. రాఘవేంద్ర రావు గారి జ్ఞాపకాలలో జంధ్యాల

జంధ్యాలతో ప్రయాణం ......

మొదట్లో  నా సినిమాలన్నిటికీ ఎక్కువశాతం సత్యానంద్ రాసేవాడు . ' అడవిరాముడు ' సత్యచిత్ర వాళ్ళు తీస్తానని ముందుకురావటం , వాళ్ళతో జంధ్యాల అంతకుముందరే ' జీవనజ్యోతి ' వంటి  సినిమాలకు  పనిచేయడంతో , ఆ అనుబంధంతో వాళ్ళు అడవిరాముడు కి కూడా అతన్నే తీసుకుంటామన్నారు . అదీకాక ,  అంతకుముందరే  సత్యానంద్ కీ జంధ్యాలకీ మంచి పరిచయం ఉండటంతో( జంట రచయితలుగా కొన్ని సినిమాలకు కూడా పని చేసారు ) అందరం కలిసి చాలా సరదాగా కథ డిస్కషన్ లో కూర్చున్నాం . ఇక ఒకసారి అడవిరాముడు హిట్ అయేసరికి , దాని తరువాత న్యాచురల్ చాయిస్ అతడే అయ్యి, ' వేటగాడు ' నుంచి ' జగదేకవీరుడు అతిలోకసుందరి ' దాకా దాదాపు 15 సినిమాల దాకా చేసాడు. నాతో చేసినవి తక్కువ సినిమాలే  అయినా  చేసినవన్నీ  పెద్ద పిక్చర్లే , అన్నీ దాదాపు సెన్సేషనల్ హిట్సే .

Read more...

దర్శకులు కె. విశ్వనాధ్ గారి జ్ఞాపకాల్లో జంధ్యాల

జంధ్యాలతో  పరిచయం 

ఒక నాటక రచయితగా, రంగస్థల నటుడిగా మొదటిసారి జంధ్యాలను వాణీమహల్ లో చూసాను  . తర్వాత ఆయన 1972 లో మద్రాసు వచ్చాకా మా ఇంటికెదురుగానే అద్దెకుండేవారు. ఎదురుబొదురే  కాబట్టి ఇద్దరం రోజూ కలిసేవాళ్ళం . అలా మా ఇద్దరికీ పరిచయం పెరిగింది . తర్వాత బిఎన్ రెడ్డిగారికి ఏదో సబ్జెక్ట్ చేస్తున్నారని విన్నాను కానీ అనుకోకుండా ఆయన చనిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం , అదే టైం లో నేను సిరిసిరిమువ్వ ప్లాన్ చెయ్యడం, అతనికి నా దగ్గర పని చెయ్యాలని కోరిక కలగడంతో దర్శక రచయితలుగా మా ఇద్దరి అనుబంధం మొదలైంది . చెప్పాలంటే అతను ఒక డైలాగ్ రైటరుకానే కాక , ఒక అసిస్టెంట్ డైరెక్టరుగా నిత్యం మాతోనే ఉండేవాడు . ఆ సినిమా తర్వాత పరిచయం ఇంకా గట్టిపడటం వల్ల ,తర్వాత  ఏ సినిమాకు స్క్రిప్ట్ రాయించుకోవాలన్నా జంధ్యాల చేస్తే బాగుంటుందేమో అన్నంత ఆత్మీయుడయ్యాడు.

Read more...