జంధ్యాల గురించి తనికెళ్ళ భరణి (నక్షత్ర దర్శనంలో)

 

  తరలి రాని లోకాలకు

  మరలెళ్లిన జంధ్యాలని

  తల్చుకుంటే జారినట్టి

  అశ్రు బిందువా!

 

 

 

Read more...

అబ్బెబ్బే....ఎవరు చూస్తారు ఈ సినిమా

జంధ్యాల రికార్డ్

సాగర సంగమమే...ప్రణయ సాగర సంగమమే…..

 భారతీ రాజా గారి  " సీతాకోక చిలుక" గురించి జంధ్యాల గారి మాటల్లో….  

సాగరసంగమం - సీతాకోక చిలుక “   ఏంటీ  అనుకుంటున్నారా? కాఫీ కి స్పెల్లింగ్ KAUPHY అని ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి సంబంధం లేకుండా చెప్పింది గుర్తొస్తోంది కదా  ….. ఇదిగో అసలు విషయానికి వచ్చేస్తున్నా జంధ్యాల గారి ఇంటర్వ్యూ నుండి సేకరించిన విషయం ఇది…. 

భారతీ రాజా గారు మురళి, అరుణ  హీరో హీరోయిన్స్ గా  ఒక మంచి ప్రేమకథని తీద్దామని అనుకున్నారు., 90 శాతం షూటింగ్ కూడా అయింది. ఈ సినిమా కి జంధ్యాల గారు  మాటల రచయిత. 

Read more...

"చంటబ్బాయ్" సినిమాలోంచి

చంటబ్బాయ్ సినిమాలో తను అమ్మాయిగా నటించడాన్ని తల్చుకుని చిరంజీవి మాటల్లోనే:

నిజం చెప్పొద్దూ నన్ను నేను అమ్మాయిగా ఊహించుకోగానే నవ్వొచ్చేసింది.మళ్ళీ జంధ్యాల ధైర్యం చెప్పారు.ఆ ధైర్యం తోటే మీసాలు తీసేసి రంగం లోకి దిగాను. అమ్మాయిగా నటించడం చాలా సరదాగా థ్రిల్లింగ్ గా అనిపించింది. సాధారణంగా కాస్త ఓవర్ గా నటిస్తారు కానీ అలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడ్డాను. నా పెర్సనాలిటీని అందుకు తగినవిధంగా మలుచుకున్నాను. సున్నితమయిన మూమెంట్స్ ఇస్తూ కళ్ళల్లో చిలిపితనం, నడకలో హొయలూ తెచ్చుకుని ఎక్కడా అతిలేకుండా జాగ్రత్తగా నటించాను.ఈ గెటప్ లో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ చేసారు. ఆడవేషంలో ఉన్న నాతో ఫొటో దిగాలని  యూనిట్ లో ఉన్నవాళ్ళందరూ ఉత్సాహపడ్డారు. కొందరు నిర్మాతలు పెద్ద హీరోయిన్ల మీదే చెయ్యేసి ఫొటో తీయించుకున్నట్టే ఫీలయ్యారు. తర్వాత నేను ఆ గెటప్ తీసేసాక నిరుత్సాహపడిపోయారు.

Read more...