హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (రెండవ భాగం)

ఆనందభైరవి చిత్రం తర్వాత బాలక్రిష్ణ హీరోగా నటించిన "బాబాయ్ అబ్బాయ్" చిత్రంలో సుత్తి వీరభద్రరావు రెండో హీరో పాత్ర పోషించారు. కనిపించినవాడినల్లా అప్పు అడుగుతూ, అబ్బాయికి సలహాలు ఇచ్చే పాత్ర ఇది. అనాధలయిన వీరిద్దరి కలయికే తమాషాగా ఉంటుంది. సినిమాల్లో ఏడుపు సన్నివేశాలు చూసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి తన తల్లికి సినిమా కథ చెప్పే అరుణ (శ్రీలక్ష్మి) ని "పేరులోనే రుణం" కూడా ఉందని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు కానీ, ఉద్యోగం సద్యోగం లేదని కూతురిని కాపురానికి పంపనంటాడు ఈయన మామ. దాంతో తప్పనిసరయి ఈయన అబ్బాయితోనే ఒక ఇంట్లో అద్దెకుంటూ అద్దె కట్టలేక ఓనరుకు మస్కా కొడుతూ అపుడపుడు పట్టుబడుతూ ఉంటారు.

ప్రతిదానికీ "త్తరై, నా త్తరై" అనడం ఈయన ఊతపదం. తమిళంలో "ఇస్తా, నేను ఇస్తా" అని దీనర్థం. అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అప్పులిచ్చినవాళ్ళు అడిగినపుడల్లా "త్తరై, నా త్తరై" అంటూ ఇంటిదగ్గరున్న బీచ్‌లో ఓ మీటింగు పెట్టి  "శ్రీక్రిష్ణదేవరాయలవంటి కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంతవిలువయిందో గ్రహించండి. ఇంగ్లీషులో కూడా డౌను కంటే అప్పు ఉన్నతమయిందా కదా" అంటూ అప్పు గురించి స్పీచ్ ఇస్తాడు.

Read more...

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (మొదటి భాగం)

'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అన్న హాస్య బ్రహ్మ జంధ్యాల హాస్యప్రియులకు అందించిన మరో వరంసుత్తి వీరభద్రరావు గారు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు సుత్తివీరభద్రరావు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. చిత్రమయిన పాత్రలలో మరింత విచిత్రమయినఅలవాట్లు, సంభాషణలతో హాస్యానికి కొత్త నిర్వచనాన్ని అందిచారు సుత్తివీరభద్రరావు.

విజయవాడలో కాలేజీలో చదువుకుంటున్నపుడే నటనపై ఆసక్తి పెంచుకున్నవీరభద్రరావు నాటకాలలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. జంధ్యాల దర్శకత్వం వహించిన "నాలుగు స్తంభాలాట" చిత్రంద్వారా తెరంగ్రేటం చేసి ఎన్నో మరిచిపోలేని పాత్రలతోప్రేక్షకులను నవ్వించారు. తన అలవాట్లతో పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టడం, అవతలివాళ్ళుఉక్కిరిబిక్కిరయ్యేలా గుక్క తిప్పుకోకుండా  మాట్లాడడం, తిట్లు కాని తిట్లతోహింసించడం వీరభద్రరావుకే చెల్లింది. హాస్య బ్రహ్మ జంధ్యాల సినిమా అంటే హీరో ఎవరయినాముందుగా గుర్తుకొచ్చే ఈ హాస్య చక్రవర్తిని, పరోక్షంగా హాస్య బ్రహ్మను, స్మరించుకుంటూ ఆయన నటించిన కొన్ని చిత్రాలను గుర్తుచేసుకొనే ఓ చిన్న ప్రయత్నమే ఈవ్యాసాల ఉద్దేశ్యం.

Read more...

జంధ్యామారుతం పుస్తకం గురించి సమీక్ష

జంద్యాల అభిమానులకు "జంధ్యావందనం" సభ్యుల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.

ఈ రోజు హాస్య బ్రహ్మ జంధ్యాల జన్మదినం. భౌతికంగా అమరుడయినా ఆయన తన సినిమాలు/సంభాషణల ద్వారా మనమధ్యే చిరంజీవి గా ఉంటారని ఉండాలని కోరుకుంటూ.......

శ్రీ పులగం చిన్నారయణ గారు జంధ్యాల సినిమాలపై వ్రాసిన "జంధ్యామారుతం" విశ్లేషణాత్మక పుస్తకం పైన ఒక సమీక్ష మీ కోసం...

జంధ్యాల సినిమాలు చూడడం, వాటి గురించి మాటాడుకోవడం మాత్రమే కాదు, ఆ సినిమాల గురించి చదవడంలోనూ ఓ ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని అందించే పుస్తకం 'జంధ్యా మారుతం.' దర్శకుడిగా తన పద్దెనిమిదేళ్ళ కెరీర్లో జంధ్యాల తెరకెక్కించిన ముప్ఫై తొమ్మిది సినిమాలలో, ఇరవై ఎనిమిది సినిమాల గురించి సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ సవివరంగా రాసిన వ్యాసాల సంకలనమిది. పేరుకి తగ్గట్టే, పుస్తకం చదువుతున్నంతసేపూ, ఓ పిల్ల తెమ్మెర స్పృశించి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది పాఠకులకి. 

Read more...

నాకు తెలిసిన జంధ్యాల (మల్లాది వెంకట కృష్ణమూర్తి)

శ్రీ విన్నకోట రామన్న పంతులు ఇల్లు విజయవాడలో, మా సందు చివర ఇల్లే.  అది 1968 వ సంవత్సరం. వారింటి ఎదురుగా చిన్న స్టేజ్ కట్టి ఓ నాటకం ఆడుతున్నారు. నా క్లాస్మేట్ ఒకరు వచ్చి, ఆ ఆడేవారు మేం చదివే ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్ ప్రభుత్వ  కళాశాల విధ్యార్థులేనని, చూద్దాం రమ్మని పిలిచాడు. ఆ నాటకం పేరు గుర్తులేదు కాని దాని రచయిత జంధ్యాల అని గుర్తు. నాటకాలంటే నాకు మొదటి నించీ అంతగా ఆసక్తి లేదు కాబట్టి నేనా నాటకానికి వెళ్ళనేలేదు.  ఆ తర్వాత కాలేజ్ డే రోజున జంధ్యాల, రఘ(కెమేరామన్) సుబ్బరాయశర్మ, వీరభద్రరావు మొదలైనవారు కలిసి ఆడిన ఆ నాటకాన్ని చూసాం.  దాని పేరు ‘గుండెలు మార్చబడును.’

 “ఇదే ఆరోజు వాళ్ళు వేసింది” చెప్పాడు నా మిత్రుడు.

 కాలేజి రోజుల్లో మా ఇద్దరికీ ముఖాముఖీ పరిచయం లేదు. 

Read more...

హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు)ఆఖరి భాగం

అప్పుడే చూసి వచ్చిన సినిమా అక్షరం పొల్లుపోకుండా మొదటినుంచి చివరి పతాక సన్నివేశం  శుభం దాకా వివరంగా వర్ణించి చెప్పే స్త్రీ (శ్రీ లలితా శివ జ్యోతి పిక్చర్స్ వారి లవకుశ, తారాగణం  N.T. రామారావు, అంజలి దేవి ..... సౌండ్ రికార్డింగ్  వెస్ట్రేక్స్  ఆడియో …దుస్తులు పీతాంబరం….  ఔట్ డోర్ యూనిట్ ఆనంద్ సినీ సర్వీసెస్ .... పోరాటాలు జూడో రత్నం...), దేశ విదేశీ వంటకాల మీద వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ , చికెనవా ఉస్తిమోవ్ అనే రష్యా వారి పాయసం,  బెట్టిబోని సెమి అనే జపాన్ వారి వంటకం తయారు చేసే స్త్రీ, పెళ్లి చేసుకున్న పడతి తనతో పాట పాడక పోయినా, తనకు వండి పెట్టక పోయినా సర్దుకు పోయే దురదృష్టవంతుడు (ముష్టివాడు కూడా వీళ్ళ ఇంటిదగ్గర అయ్యా మాదాకోళం అయ్యా అనే అరుస్తాడు,  ఆయన టెలిమార్కెటింగ్ వాళ్ళ వంటింటి పరికరాలికి, వంట సామాగ్రి కి కూడా  బలి అవుతాడు), మార్నింగ్ వాక్ లో దోవలో కనిపించిన  దురదృష్ట వంతులు అందరికీ తన జీవిత కధ  చెప్పి ఆనందించే ఒక పెద్దమనిషి ( ఏమిటీ నీకు కస్తూరి  గురించి తెలియదా, పద అలా నడుస్తూ మాట్లాడుకుందాము),  తన రచనలు పత్రికా  సంపాదకులు తిరిగి పంపినా , ప్రచురించటానికి తిరస్కరించినా సరే , తను  గొప్ప కవయిత్రి నే అని నమ్మే స్త్రీ (నేను కవయిత్రిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్నవాడిని రాయితో కొడతా ... అంటూ సాధించే ఆవిడ),చిన్న తనం లోనే తప్పి పోయిన తన కొడుకు జ్ఙాపకాలను  ఎవరైనా గుర్తు చేస్తే తన్మయత్వం చెందే తల్లి  (బాబూ చిట్టీ , మా చిట్టి కూడా అలానే కత్తి బాకు అని అంటుండే వాడు బాబు అని అనేది ఎవరైనా కుర్రాడు కత్తిలా ఉన్నాడు అని అంటే)

Read more...