జంధ్యాల సృష్టి… లాఫింగ్ లక్ష్మి… శ్రీలక్ష్మి

హాస్యం చేయాలంటే ముఖాన్ని వికారంగా మార్చాలి. ఆడవాళ్లు ఆ పని చేయడానికి ఇష్టపడరు. అందుకే మనకు లేడీ కమెడియన్స్ తక్కువ’ అన్నాడు కమెడియన్ జావెద్ జాఫ్రీ. కాని- బహుశా- అలా ఆలోచించడానికి శ్రీలక్ష్మికి వీలు లేదు. అంత తీరుబడీ లేదు.కుటుంబ అవసరాలు శూలం పట్టుకొని తరుముతూ వుంటే పరిగెత్తుకొని వెళ్లి సినీ సముద్రంలో దూకింది. మునకలు వేసింది. గుటకలు మింగింది. ఆపైన కామెడీ అనే బల్లచెక్క దొరికితే ఎక్కి కూచుంది.ఇక అక్కణ్ణుంచి ఆమె చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది.తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పువ్వులుగా పెనవేసుకున్నది.
శుభం జరగాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉండాలంటారు. అలాగే లాఫింగ్ శ్రీలక్ష్మి సినిమాలు కూడా.
ఎప్పుడైనా డస్సిపోయినప్పుడు బెంగటిల్లినప్పుడు నల్లమబ్బులు కమ్ముకున్నప్పుడు వీటన్నింటిని ఫెటీల్మని విరిచే ఒక్క నవ్వే రీఛార్జ్. 
ఆ నవ్వుని శ్రీలక్ష్మి వడ్డిస్తే - బెస్ట్ రీఛార్జ్.

Read more...

తెలుగు పాటలకు పట్టు పరికిణీలు

కొబ్బరి నీళ్ళ జలకాలాడినంత హాయిగా….

లిపి లేని కంటి భాషలేవో చదివి వివరించినట్టుగా.....
లేత చలిగాలులేవో చక్కిలిగింతలు పెడుతున్నట్టుగా
సరిగమపదని స్వరధారలో తడిసిపోతునట్టుగా.......

పై వాక్యాలు చదువుతుంటే, మనసులో ఏవో స్పష్టాస్పష్ట జ్ఞాపకాలు మెదులుతున్నాయా?  స్వప్న రాదారుల్లోకి పగలల్లా అలసిన మనసు పయనం మొదలెట్టబోయే క్షణాల్లో మీ చెవి పక్క రేడియో రహస్యంగా వినిపించిన రాగాలేమైనా గుర్తొస్తున్నాయా? నిజమే! ఇవన్నీ ఆ మళ్ళీ రాని, మదినొదిలి పోని రోజుల మధుర జ్ఞాపకాలే! అంతే కాదు,  ఆ అనుభూతులన్నింటి వెనుక, ఒకటే పాటల తోటలో పుట్టిన జట్టు ఉంది.

Read more...

హాస్య బ్రహ్మ జంధ్యాల....(వెలుగు నీడలు)3వ భాగం

పాతబడుతున్నకొద్ది మాధుర్యం పెరుగుతూ, విన్నకొద్ది వినాలనిపిస్తూ, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆణిముత్యాలు అనిపించుకొదగిన  సినిమాలు తెలుగు చిత్ర సీమలో ఉన్నాయి. గత శతాబ్దపు డెభ్భయ్యో దశకం, ఎనభయ్యో దశకం దాకా జంధ్యాల కమర్షియల్ సినిమాల తోపాటు సంస్కృతి, సాంప్రదాయాలతో  విలువలు పెంచే కళాత్మక సినిమాలో కూడా తనదైన ముద్ర వేశాడు. కమర్షియల్ సినిమాలు తో జంధ్యాలకి విజయాలు , ధనం దక్కినా, కళాత్మక సినిమాల్లో రచయిత గా  మంచి పేరు తెచ్చుకున్నారు.  ఈ సినిమాల్లో ఏ పాత్రని ఎక్కువ చేసి చూపించఖ్ఖరలేదు, అనవసరమైన నాటకీయత సృష్టించఖ్ఖరలేదు, కధతో సంబంధం లేకుండా కామెడీ సన్నివేశాలు కల్పించ నవసరం లేదు, పాత్రలన్నీ కధలో ఇమిడి అంతర్భాగం కావాలి. ఇన్ని నిబంధనల మధ్య జంధ్యాల రచయితగా ఉన్నత శిఖరాలు అందుకున్నారు. సన్నివేశాలకు తగినట్టు మాటలు వ్రాసి, అనవసర కామెడీ జోలికి పోకుండా, పాత్రోచితంగా వీలైనంతగా  సున్నితమైన హాస్యం అల్లి, తనదైన శైలి లో ప్రేక్షకులను మురిపించారు.

Read more...

హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు) 2వ భాగం

సాధారణం గా  కమర్షియల్ సినిమా లో కధ  కి ప్రాముఖ్యం ఉండదు. ఉన్న కధ కూడా నమ్మదగ్గది గా ఉండదు. ఆసంబద్ధం, అస్వాభావికం అయిన కధలో అర్ధం చేసుకోవడానికి వీలుకాని, అసాధ్యమైన  హీరో చేసే వీరోచిత కృత్యాలు కమర్షియల్ సినిమాలో ముఖ్య భాగమై పోయాయి. కమర్షి యల్ సినిమాలో అర్ధం వెతకడం, కధలో మలుపులు, మెరుపులు ఊహించడం వృధా ప్రయాస. మనస్సు తో కానీ బుద్ధితో కానీ ఆలోచించడానికి ఏమి ఉండకపోవచ్చు అందులో. ఇటువంటి సినిమాల ముఖ్యోద్దేశం ప్రేక్షకుడి ని అలరించి ఒక మూడుగంటలు ఆనందింప చేయడము మాత్రమే. వినోదమే ప్రధానమైన సినిమాలో వినోదాన్ని ఎంత బాగా పంచగలిగారు అన్నదాని మీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. 

Read more...

హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు) 1వ భాగం

ఒక భావాన్ని వెయ్యి పదాల తో కన్నా ఒక చిత్రం లో బాగా పలికించ గలం.   అందుకనే సినిమా ని ఒక దృశ్యకావ్యం అంటారు.  మూకీ చిత్రాలనుంచి టాకీ చిత్రాల కెదిగేక్రమం లో  సినిమాల్లో అనేక మార్పులు  చోటు చేసుకొన్నాయి.  ఆధునిక కాలం లో ధ్వని, రికార్డింగ్  ప్రాధాన్యత పెరిగింది. సినిమా లో  తెరమీద సీను కి దూరం గా ఉన్న అతి చిన్న శబ్దాలు సైతం చిత్రీకరింపబడి  సినిమాలో మేళవింప బడుతున్నాయి.    చిత్రం,    వెయ్యిపదాల భావం తెలిపేదయినా, ఒక్కొక్కప్పుడు ఒక మాట  చిత్రం లోని భావానికి పదును పెడుతుంది, వన్నె తెస్తుంది, మనోభావాలని ఆకళింపు చేసుకొనే టందుకు ఉపయోగపడుతూ చిత్రానికి ఒక పరిపూర్ణతను తెస్తుంది.  చిత్రం మనకి అర్ధం అయ్యే ప్రక్రియ లో రెండు భాగాలున్నాయి. చిత్రం మన మెదడులో ముద్రించబడి ఆ పైన పదాలుగా మారి  భావం మనకు అర్ధం అవుతుంది. ఈ భావ వ్యక్తీకరణ  పరిపూర్ణం గా ఉండక పోవచ్చు. కానీ పలికిన మాటల  తో  వెంటనే అతి సహజం గా భావాన్ని   పూర్తిగా  అర్ధం చేసుకో గలుగు తాము.  ఉదాహరణగా దేవదాసు చిత్రం లో ఒక  సన్నివేశం చూద్దాం. అవసానదశలో  తమ ఊరికి చేరుకున్న మనిషి దేవదాసు అని తెలియగానే, పార్వతి ఘట్టిగా అతని పేరు అరచి పిలుస్తూ పరిగెడుతుంది.

Read more...