ఉయ్యాలా... జంపాల... ఇయ్యాల... నవ్వాల... వేయేల... జంధ్యాల ....

 

 

జంధ్యాల గారి వర్ధంతి అని చెప్పి ఏదైనా ఆర్టికల్ రాయచ్చుగా అని ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు . నాకు నవ్వొచ్చింది. నవ్వేవాళ్ళు ఉన్నంతకాలం నవ్వించేవాళ్ళు ఉన్నంతకాలం సినిమాలో కామెడీ ఉన్నంత కాలం జంధ్యాల మన మధ్యనే వుంటారు.  పడి చచ్చేంతగా మనల్ని నవ్వించి తన దారి తను చూసుకోటానికి అంతా ఆయన ఇష్టమేనాఏంటి ? ఎక్కడికెళతాడాయన? నవ్వులు మన ముఖాన కొట్టి ఆయన ముఖం చాటేస్తే మనం ఊరుకుంటామా ఏంటి ? నెవర్. ఒక దశలో కేరాఫ్ అడ్రస్ కూడా లేకుండా విలవిల్లాడుతున్న తెలుగు సినిమా కామెడీకి ఓ అధునాతన భవంతిని కట్టించి ఇచ్చాడు. నవ్వలేని వాళ్ళకు నవ్వులు నేర్పించాడు. నవ్వేవాళ్ళను పగలబడి నవ్వించాడు. గుర్తొచ్చి గుర్తొచ్చిమరీ నవ్వుకునేలా చేశాడు. ఒకటా ... రెండా... ఎన్ని సినిమాలు... ఎన్ని పాత్రలు ...ఎన్ని రకాల మ్యానరిజమ్స్ ... మరెవరి వల్లాకాని పని ... ఇంకెవరూ సాహసించలేని ప్రయత్నం.

Read more...

హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు)6వ భాగం

తమ్ముడూ భరతా! పితృవాక్య పరిపాలనా దక్షుడిగా,  ఆడిన మాట తప్పని ఒక బాధ్యాయుతుడైన కొడుకుగా, ప్రజల సంక్షేమం ఎల్లప్పుడు కోరుకునే  ఒక ఆదర్శవంతమైన రాజు గా, ధర్మం నాలుగు పాదాలా నడపవలసిన ముగ్గురు తమ్ముల అన్నగా, నేను ఆ రాజ్య పదవి తీసుకోలేను తమ్ముడూ తీసుకోలేను.

అన్నయ్యా నేను రాను అని ఒక్క మాట చెబితే సరిపోదా, దీనికి అంత సుత్తి ఎందుకు?

సుత్తి అనే మాట త్రేతాయుగం లో భరతుడి సృష్టిగా, జంద్యాల మార్కు  చమత్కారం తో సుత్తివేలు చేత నాలుగు స్థంభాల ఆట  సినిమాలో చెప్పించారు. అప్పటినుంచి ఈ పదం సుత్తి ప్రజల కి ఒక వాడుక మాట గా ఆదరణ పొందింది. 

 

 

Read more...

హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు)5వ భాగం

సినిమాలకి  ముఖ్యమైన సంగీతం, పాటలు గురించి జంధ్యాల చాలా శ్రద్ధ తీసుకుంటారు.

కౌమార దశలో ఉన్న ప్రేమికుడు,  ప్రేమికురాలు ఇంటిలోంచి పారిపోయి వచ్చేస్తారు.  ఒక హోటల్ గదిలో ఇద్దరే మొదటిమాటు ఉంటారు. ఈ సందర్భంలో  ఇద్దరి లోనూ  ఆమాయకత్వం , తెలుసుకోవాలనే  కోరిక ఉంటాయి.  ఇద్దరిలోనూ స్వచ్ఛత, నిర్మలత్వం ఉంది కానీ వాంఛ కూడా ఉంది. 

Read more...

జంధ్యాల కల "అన్నమయ్య" సినిమా గురించి విశేషాలు.

మీ అందరికీ ఆనందభైరవి సినిమా గురించి తెలిసే ఉంటుంది ...  ఆ సినిమా పూర్తి అయ్యాక...దాన్ని కొనే వాళ్ళు దొరకలేదు...సినిమా పూర్తి  అయ్యాక దాదాపు గా ఒక సంవత్సరం ఆ సినిమా ని కొనే నాధుడు లేకుండా పోయాడు. కామెడీ సినిమాలు తీసే జంధ్యాల ఇలాంటి సినిమా తీస్తే ఎవరూ చూడరు అన్న గుడ్డి నమ్మకం వల్ల దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. చివరకి దానికి నంది అవార్డు వచ్చాక లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు సినిమా మొత్తం హక్కులు ఇచ్చే పద్దతి మీద కొంటాము అన్నారు.  (శంకరాభరణం సినిమాకి కూడా ఇదే జరిగింది). "ఆనంద భైరవి" సినిమా కి నిర్మాతలు బి.ఎ.వి.శాండిల్య పాత్రికేయుడు,సీత పద్మరాజు గారు కూడా మరీ ఎక్కువ ఉన్నవాళ్లు కాదు. దాంతో వాళ్ళకి ఏదో ఒక ధరకి అమ్మక తప్పలేదు. సినిమా విడుదల అయ్యాక జరిగిన విషయాలు మీకు తెలిసినవే... 

Read more...

హాస్య బ్రహ్మ జంధ్యాల...(వెలుగు నీడలు) 4 వ భాగం

సర్వ సాధారణంగా రచయిత, సినిమాలో ఒక సన్నివేశం దర్శకుడి అభిరుచులు, దర్శకుడు కధను చిత్రీకరించే విధానం లను దృష్టిలో పెట్టుకొని వ్రాయాల్సి ఉంటుంది.  దర్శకుడి ఆదేశాను సారం వ్రాయడం వల్ల  రచయిత తన భావాలను, సృజన ను పూర్తిగా పలికించలేకపోవచ్చు. రచయితే దర్శకుడిగా కూడా ద్విపాత్రాభినయనం చేయాల్సి వచ్చినప్పుడు, రెండు  పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించే టప్పుడు  స్వల్ప ఘర్షణ బహుశా తప్పక పోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వైవిద్యభరితమైన , ఇదివరలో ఎవరూ సాహసించని కొత్త వరవడి ని కధా క్రమం లో కానీ, చిత్రీకరణలో కానీ, చిత్రం జయాపజయాల తో నిమిత్తం లేకుండా ఎంచుకోగలడా? జంధ్యాల ఇవి అన్నీ చేసి చూపించారు. అటు మాస్ కమర్షియల్ సినిమాలు ఇటు కళాత్మకమైన సినిమాలకు కూడా, విజయ వంతంగా వరుసగా ఒక దాని తరువాత ఒకటి శతదినోత్సవ చిత్రాలకు  రచిస్తూ కూడా  తనలోని సృజనాత్మకతను వెలికి తీసి ఒక కొత్త తరహా సినిమాలకి నుడికారం చుట్టారు జంధ్యాల. మధ్యే మార్గంలో కళాత్మక సినిమాల్లోని ఆలోచనా ధోరణులని  సున్నితత్వాన్ని మాస్ సినిమాల్లోని జనాకర్షణ పద్ధతులని మేళవించి ప్రేక్షకులను మెప్పించారు. 

Read more...