కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో

రెండు రెళ్ళు ఆరు

కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో!
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో!

కాస్తందుకో, దరఖాస్తందుకో, భామ ధర కాస్తందుకో!
దగ్గర చేరి దస్కతు చేసి, ప్రేయసి కౌగిలి అందుకో!

చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు, మెరుపంత నవ్వునా చినుకైన రాలునా?
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు, వరదల్లె పొంగునా కడలింట చేరునా?
శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే!

చలిగాలి దరఖాస్తు తొలిఈడు వినకుంటే, చెలి చెంత చేరునా చెలిమల్లే మారునా?
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు, ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
దరి చేరి కూడా దరఖాస్తులేలా? 

 

 

Comments:

 

శ్రీనివాస్ పప్పు.... 13 weeks ago

మార్చానండీ మానస గారూ,ధన్యవాదాలు సరిచేసినందుకు 

Manasa... 13 weeks ago 

శ్రీనివాస్ గారూ :  "దగ్గర చేరి దస్కతు చేసి" అనుకుంటానండీ..పాటలో స్పష్టంగా వినపడని మాట నిజమే కానీ, "స"కారమొకటి వినపడదూ? దానిని బట్టి దస్కతు అని రాశారేమో వేటూరి అనుకుంటున్నా..! దస్కతు అంటే సంతకం అని ఒక అర్థం ఉంది.