RSS Feeds

feed-image Feed Entries

online visitors

We have 10 guests and no members online

Site Info

Articles View Hits
286544

హాస్యబ్రహ్మ జంధ్యాలగారి చివరి ముఖాముఖి (శ్రీ అట్లూరి)

హాస్యబ్రహ్మ జంధ్యాలగారి చివరి ముఖాముఖి ఇదే (ఇదేమొదటి, చివరి వెబ్ ఇంటర్వ్యూ కూడా). నేను జనవరిలో ఆయన్ని కలిసి ఒక గంటపైనే మాట్లాడాను. ఆయన ఎంతో మృదుస్వభావి, అహం అన్నది తెలియనివారు. ఆయనతో ఒక ఫొటో తీయించుకోవాలనుకున్నాను. ఆయనకి నేను బాగా నచ్చానని చెప్పి మళ్ళీ తప్పకుండా కలుద్దాం అన్నారు. నేను నాపనులలో బిజీగా ఉండి మళ్ళీ కలవలేకపోయాను. అలా ఆయన ఫొటో తీసుకుని జ్ఞాపకంగా దాచుకునే అవకాశము చేజారిపోయింది.

గురువారం ఉదయం జంధ్యాలగారికి ఫోన్ చేసి ఆయనతో "ముఖాముఖి" కావాలని అడిగాను. ఆ రోజువాళ్ళింట్లో ఏదో పూజ ఉన్నదని చెప్పి శుక్రవారం పొద్దున్న 10.00 గంటలకి రమ్మన్నారు. మర్నాడు, అనుకున్న సమయానికి ఐదు నిముషాల ముందే వాళ్ళింటికి చేరాను. ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు "సాహితి","సంపద"లను గుమ్మంలోనే కలిసాను. వారిద్దరూ ఒక చిన్న కుక్కపిల్లను పట్టుకుని ఆడుకుంటున్నారు. ముందుగది సాధారణ ఎగువ మధ్యతరగతి జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. అక్కడ జంధ్యాలగారి కీర్తిని చాటుతూ అనేకానేక ప్రశంసలు, బహుమతులు కొలువుదీరి ఉన్నాయి.సగం గదినిండా నిన్నటి పూజాసామాగ్రి పరచి ఉంది (తరువాత మాటల్లో ఆయన, పుట్టపర్తిసాయిబాబాకి గొప్పభక్తులని, విధిగా ప్రతీ గురువారమూ సాయిబాబా పూజ గావిస్తారని చెప్పారు). పలకరింపులు అయ్యాక జంధ్యాలగారితో నా ముఖాముఖి ఇలాసాగింది..... 

- By శ్రీ

Read more...

శ్రీ జంధ్యాల గారితో ఒక ఇంటర్వ్యూ

మంచి హాస్యం లేత ఆకుతో తట్టినంత మృదువుగా ఉండాలి, అంటారు శ్రీ జంధ్యాల

చార్టెడ్ అకౌంటెన్సీ చదివి ఆడిటర్ అవుదామనుకున్న జంధ్యాల ని,    దేముడు  తెలుగు సినిమా లలో  అనుపమానమైన హాస్య సృష్టి చేసి,  ప్రేక్షకులకు ఆహ్లాద కరమైన హాస్యం పంచమని హాస్య బ్రహ్మ గా  మార్చేసాడు. అన్ని రకాల ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న కళాత్మక సినిమాలు శంకరాభరణం, సాగరసంగమం, బాక్సాఫీసు బద్దలు కొట్టిన అడవిరాముడు, జగదేక వీరుడు – అతిలోక సుందరి  లాంటి కమర్షియల్  సినిమాల రచయితగా, విజయవంతమైన సినిమాలు ముద్దమందారం, నాలుగు స్థంబాలాట, ఆహా నా పెళ్ళంట, ఆనందభైరవి, పడమటి సంధ్యారాగం లాంటి సినిమాల దర్శకుడిగా జంధ్యాల, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయారు. సకుటుంబ సపరివారం గా చూడ దగ్గ హాస్య  సినిమాల రచయితగా, దర్శకుడిగా జంధ్యాల ముందు తరం వారికి మార్గ నిర్దేశకులయ్యారు.

ప్రేక్షకులకు ప్రీతిపాత్రుడైన జంధ్యాల గారితో HamaraShehar.com వారి ఇంటర్వ్యూ .

Read more...

ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో ముఖాముఖీ

జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన  "శ్రీవారికి ప్రేమలేఖ" సినిమాకి కథ అందించిన ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో జంధ్యావందనం తరపున దాట్ల లలిత గారి చింటర్వూ (చిన్న ఇంటర్వూ) 

నమస్తే విజయలక్ష్మిగారూ….మున్ముందుగా.....ఎవరీ అక్కుపక్షి అని విసుక్కోకుండా, చేయి ఖాళీలేదు ఎల్లెల్లవమ్మా అని తోలెయ్యకుండా ......అడగ్గానే మాకోసం , కాసిన్ని కబుర్లు , మరికాసిన్ని జ్ఞాపకాలు  పంచడానికొచ్చిన మీకు "జంధ్యావందనం" టీం తరపున మనః పూర్వక ధన్యవాదాలు .

మరి మొదలుపెడదావాండీ ........."  శ్రీ లలితా శివజ్యోతీ ప్రొడక్షన్ వారి  ....” ఆ..హా..హా అంతఓపిక లేదంటారా ! సరే అయితే ఈసారికి ఇలా కానిద్దాం !

Read more...