"శ్రీవారికి ప్రేమలేఖ" సినిమా నించి కొన్ని మెచ్చుతునకలు

ఒరే అలా చేతులు వణికించావంటే నీ నవరంధ్రాల్లోనూ మైనం కూరతాను తలమాసిన కుంకా...గడ్డం గీస్తే సుతారంగా నెమలి ఈకతో నిమిరినట్టుండాలిరా...గోకుడు పారతో గోకినట్టు కాదు.

 

బాబూ తమరిట్టా గాలిపటంలా కదిలిపోతే ఏ పీకో తెగి రేపటీయాల్నించీ నేను జైల్లో గడ్డాలు గీసుకోవాల్సి వస్తుంది.

 

ఊ…లేవోయ్ భీముడూ...లే కుంకన్నర నన్ను తెగిపోయిన పాతచెప్పుకింద జమకట్టి వేరే బేరాలున్నాయ్ అంటూ నీలుగుతున్నాడు వెధవ,ఎలా కదులుతాడో చూస్తాను,కూర్చుని శుభ్రంగా గుండు గీకించుకో.

గుండా..అయ్యా వీడిమీద కోపంతో నాకు గుండు గీకించి ఇంకా రెండు నెలలు కాలేదు,ఇప్పటికిది పన్నెండో గుండు,ఇంకోసారి ఇలాగే గుండు గీకిస్తే నాకు విడాకులిచ్చి లేచిపోతానని బెదిరిస్తోంది మా ఆవిడ,భృత్యుడ్ని క్షమించి ఆ గుండు వరం ప్రసాదించకండి మహాప్రభో.

 

అయ్యా మహాప్రభువుల వ్యాకరణం తమకు తెలీనిదేముంది చెప్పండి,వారికి తృతీయ తత్పురుష లేదు,నేను నువ్వు అనేవే తప్ప అతడు ఆమే అనేవే లేవు.ఇప్పుడు వారిని కరిచిన కుక్కకి పిచ్చెక్కి చచ్చిందనుకోండి,నన్ను కరిచి నువ్వు చచ్చావంటారాయన.

చాల్లే ఊరుకో...నన్ను కుక్క కరిచిన విషయం దేశమంతా చెప్పాలా?వెధవర్ధాయుష్షు కుక్క. 

 

అమ్మాయ్ ఎంతవరకూ చదివావ్?

మధు నిర్మలని అపార్ధం చేసుకునేవరకూ.

నోర్ముయ్ ముయ్..య్..

వారడిగేది నువ్విపుడు చదువుతున్న నవలగురించి కాదమ్మా,మామూలు చదువు.

 

ఇదిగో మాటలు జాగ్రత్తగా రానీండి,ఇలా రాంగ్ షో చూపించారంటే డైమండ్ ఆసు పెట్టి పొడుస్తాను జాగ్రత్త.

 

ఏం తాగొచ్చావేమిట్రా అక్కుపక్షీ?

 

ఛీ..ఛీ..తాగడం అని ఆ పనికున్నా గౌరవాన్ని పాడుచేయకు,మాట్టాడుకుని వచ్చా,ఒంటరిగా కూర్చుని నాలో నేనే బండబూతులు మట్టాడుకుని వచ్చా.

 

అశొకుడూ...కనిష్కుడూనా..వాళ్ళెవరట?

డైమండ్ రాజూ..కళావర్ రాజూను.

కలకత్తా భౌ భౌ వండటం గురించి చెబ్తున్నాను మావయ్యా.

 

నా టూరింగ్ టాకీసా మా అమ్మే దొరికిందా నువ్వు వేయించుకు తినడానికి.

నా కదిలే మిలిటరీ భోజన హొటలా మా అక్కయ్యే దొరికిందా వేయించుకుని తినడానికి

అబ్బా ఉండండీ ఏదో చెబుదామనుకున్నాను మర్చిపోయాను.

సింగినాదం..జీలకర్రా..

ఆ...భౌ భౌ మీద జీలకర్ర కూడా వేస్తే బాగుంటుందమ్మా

డి.డి.టి వేస్తే ఇంకా బాగుంటుంది  

 

Comments:

 

Ganesh... 9 weeks ago

Fantastic Comedy Movie ...............i Luv this movie

Siva Rama Prasad. 15 weeks ago

మీలాంటి అభిమానులకు కోటి వందనాలు, జంధ్యాలగారికి శతకోటి వందనాలు.. శివరామ ప్రసాద్..

subha... 15 weeks ago

:):):):):):)

తెలుగు భావాలు... 15 weeks ago +1 points

ఒకప్పుడు సినిమాలు కాసెట్టుల్లో (Casettes) వచ్చేవి. మా వద్ద "శ్రీవారికి ప్రేమలేఖ" కుడా ఉండేది. తెగ వినే వాళ్ళం. చూసినపుడు ఎంత నవ్వొస్తుందో, విన్నా - చదివినా అంతే వస్తుంది. ఇలాంటి హాస్యం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో!?! 

Rajesh Maramర... 15 weeks ago 

:))