లిపి లేని కంటి బాస (శ్రీవారికి ప్రేమలేఖ)

లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

చరణం1:


అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉంది వేదన తానై
విదియ నాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
లల ఆ ఆ లల ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తనన తనన తనన తనన
ఎదుగుతు ఉంది వెన్నెల తానై
ఒక్కనాటి పున్నమి కోసం

లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

చరణం2:

అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను

బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నీ లేఖని ప్రణయ లేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

రచన: వేటూరి.
సంగీతం: రమేష్ నాయుడు
గానం: బాలు, జానకి

 

 

Comments:

 

శ్రీనివాస్ పప్పు...

18 weeks ago · 0 replies · 0 points

 
మార్చానండీ మానస గారూ థాంక్యూ   

 

Manasa Chamarthi ...

18 weeks ago ·

 
Great song,  can you pls correct the mistake : గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను
should be,
 
" గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను. "