ఇంటిపేరు జంధ్యాల అసలు పేరు స్నేహం..

ఇప్పటిమాట కాదు. చాలా ఏళ్ళ క్రితం..ఫలానా సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పలేను..  అప్పట్లో-
జంధ్యాల విజయవాడలో కాలేజీ స్టూడెంటు.  శ్రీరామా బుక్ డిపో దగ్గర కనిపించాడు. అప్పట్లో అతని చెవిలో పూలు లేకపోయినా చెవికి పోగులున్నట్టు జ్ఞాపకం!
నేను ఫలానా అని తెలీగానే-నన్ను అమాంతం కావలించుకున్నాడు. మీరు నా అభిమాన రచయిత అన్నాడు. ఈమాట అప్పట్లో నాతో ఎక్కువమంది అనేవారు కాదు!
అతను అంతమాటన్నందుకు-బహుశా-గొప్పగా ఆనందించి ఉంటాను. అంచేత అతనంటే ఇష్టం ఏర్పడు ఉండచ్చు!

Read more...

జంధ్యావందనం

హాస్యం అనే పదానికున్న అర్ధాలు వెతకడానికి తెలుగు నిఘంటువు తిరగేస్తే అందులో ఓ మూడక్షరాలు కనిపించకపోవచ్చు. కానీ, తెలుగు సినిమాకి ఓ నిఘంటువు తయారు చేస్తే అందులో హాస్యముకి ఎదురుగా తప్పకుండా ఉండే మూడక్షరాలు జంధ్యాల.’  వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అన్న తన వంటి పేరుతో ఎవరికీ తెలికయకపోయినా, జంధ్యాల అనే తన ఇంటి పేరుతో లక్షలాదిమంది తెలుగు వాళ్లకి సినిమా మాధ్యమం ద్వారా ప్రియమైన వ్యక్తిగా మారిన జంధ్యాలని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

Read more...

మహా యోగి

 సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ, జీవితాలన్నింటిలో కొన్ని లైన్లు కాపీ పేస్ట్ చేసేశాడు!

Read more...

ఓ “33+2..pass” శాల్తీ కథ – మల్లెపందిరి

ఎనభైల్లో (అనుకుంటా), జంధ్యాల గారు రాసి, తీసిన తెలుగు సినిమా, మల్లెపందిరి, ఆ తర్వాత కొన్నాళ్ళకు పుస్తకరూపేణా వచ్చింది. అది ఇన్నాళ్ళకు ఒక ఫ్రెండ్ పుణ్యమా అని నాకు దొరికింది. ఆ పుస్తక విశేషాలే ఇక్కడ!

సినిమా పరిజ్ఞానం దాదాపుగా శూన్యం అయిన నాకు, ఈ పేరున ఒక సినిమా ఉందని కూడా తెలీదు. తారాగణం అంతకన్నా తెలీదు. నూతన సంవత్సరం సంధర్భంగా తీసుకున్న రెసెల్యూషన్స్ లో జంధ్యాల గారి ఏ రచనైనా చదవాలని నిర్ణయించుకోవటంతో, అనుకోకుండా ఈ పుస్తకం దొరికేసరికి, మరో ఆలోచన లేకపోయింది.

Read more...