ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!

 ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ విషయాలు ఆయనకు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ సూత్రాలు ఆయనకు కరతలామలకం. భారత, భాగవత, రామాయణ గ్రంధాలన్నీ ఆపోసన పట్టిన వ్యక్తి. అష్టాదశపురాణాల్లో ఏ అంశంపైన అయినా తడుముకోకుండా తర్కించగలిగిన సామర్ధ్యం ఆయన సొంతం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి, నిష్టగా అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని, ఇంటినుంచి బయటపడడం తరువాయి, ఆయన జీవన శైలి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.

Read more...

చినుకులా రాలి..నదులుగా సాగి

ఈ రోజు మనందరికీ ఎంతో ఎంతో ప్రియమైన, ఆనాటి ఆణిముత్యమైన ఈ పాటను గుర్తు చేస్తున్నాను.
పైన పేరు చూసి మీ అందరికీ ఈ పాట ఏంటో తెలిసిపోయే ఉంటుంది కదా..! 
సరే...ఈ పాట 1982 లో వచ్చిన "నాలుగు స్థంభాల ఆట" అనే చిత్రంలోనిది. నలుగురు వ్యక్తుల జీవితంతో విధి ఎలా నాలుగు స్థంభాలాట ఆడిందనేదే ఈ చిత్ర కథ. ఆ నలుగురు వ్యక్తులుగా నరేష్, పూర్ణిమ, ప్రదీప్, తులసి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. ముద్ద మందారం, మల్లె పందిరి తరవాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. సందర్భం వచ్చింది కాబట్టి ఆ మహానుభావుడి గురించి కొంత మాట్లాడాలనిపిస్తుంది.

Read more...

పడమటి సంధ్యారాగం

ఉద్యోగం కోసం సొంత ఊరినీ, దేశాన్నీ వదిలి కుటుంబంతో సహా పరాయి దేశానికి వలస వెళ్ళిన తొలితరం భారతీయుడి కథే 'పడమటి సంధ్యారాగం' సినిమా. చిన్నప్పటి నుంచీ అలవాటైన పద్ధతులను, ఆచారాలనూ వదులుకోలేక, వెళ్ళిన దేశం తాలూకు సంప్రదాయాలను అలవాటు చేసుకోలేక ఓ మధ్య వయస్సు వ్యక్తి పదే ఆవేదనను తనదైన శైలిలో హాస్యస్ఫోరకంగా చిత్రీకరించారు దర్శక రచయిత జంధ్యాల. ప్రవాసాంధ్రుడు గుమ్మలూరి శాస్త్రి సినిమాని నిర్మించడమే కాక ప్రధాన పాత్రనూ రక్తి కట్టించారు.

Read more...

ఆనందభైరవి

సంప్రదాయాన్ని బతికించుకోడానికి ఓ తండ్రి పడే ఆరాటం, ఆధునికతని అందిపుచ్చుకోవాలన్న తనయుడి తపన, వీళ్ళిద్దరికీ మధ్యన నలిగిపోయే తల్లి, ప్రియురాలు. ఓ చిన్న కుటుంబంలో జరిగిన ఈ సంఘర్షణలో సంప్రదాయం గెలిచిందా? లేక ఆధునికత ముందు దాసోహమందా?? ...ఈ స్టోరీలైన్ తో, శాస్త్రీయ నృత్యం నేపధ్యంలో ఓ తెలుగు సినిమా అనగానే, 'కథ-చిత్రానువాదం-దర్శకత్వం కాశీనాధుని విశ్వనాధ్' అనే టైటిల్ ని ఊహించేసుకుంటారు మెజారిటీ ప్రేక్షకులు. కానీ, ఈ కథని తెరకెక్కించింది విశ్వనాధ్ కాదు, ఆయన ఆస్థాన రచయిత జంధ్యాల.

Read more...

హాస్య బ్రహ్మగారి " చంటబ్బాయ్ "

"లిటిరేచర్" అధ్యయనం చేసేప్పుడు కామెడి లో రకాలు చెప్తూంటారు. Romantic comedy, Farce, Comedy of humours, comedy of manners, Satiric comedy, High comedy

 ,Tragi-comedy అని బోలెడు రకాలు. హాస్యంలోని ఈ రకాలన్నింటినీ తెలుగు వెండితెరకు పరిచయం చేసిన ఘనత హాస్యబ్రహ్మ "జంధ్యాల" గారిది.
హాస్య చిత్రాలకు ఒక ప్రత్యేక గుర్తింపు, తన సంభాషణలతో తెలుగు భాషలోనే గొప్ప మార్పు

Read more...